సైరా టీజర్ టైమ్ ఫిక్స్..!!

సైరా టీజర్ టైమ్ ఫిక్స్..!!

మెగాస్టార్ చిరంజీవి సాహో మూవీ టీజర్ ఈరోజు రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  ఈరోజు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించినా ఈ ఉదయం వరకు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనే సంగతిని బయటపెట్టలేదు.  ఈరోజు ఏ సమయానికి రిలీజ్ అవుతుందో తెలియక అభిమానులు ఇబ్బంది పడ్డారు.  అయితే యూనిట్ కొద్దిసేపటి క్రితమే టీజర్ రిలీజ్ టైమ్ ను ఫిక్స్ చేసింది.  ఈ రోజు మధ్యాహ్నం 2:40 గంటలకు సైరా ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేస్తునట్టు ప్రకటించారు.  

దక్షిణాది నాలుగు భాషలు, అటు హిందీలోను ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు.  తెలుగులో మెగాస్టార్, హిందీలో అమితాబ్, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడంలో కిచ్చ సుదీప్ లు ఆయా రాష్ట్రాల్లో సైరా టీజర్లను రిలీజ్ చేయబోతున్నారు.  సో, మధ్యాహ్నం 2:40 గంటల నుంచి సైరా సందడి మొదలౌతుందన్నమాట.  ఈ టీజర్ కోసం మెగా అభిమానులతో పాటు తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.