సాహో ని సైరా బీట్ చేస్తుందా ?

సాహో ని సైరా బీట్ చేస్తుందా ?

సాహో ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  యాక్షన్ త్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  దాదాపు రూ. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించింది.  ఇప్పటికే భారీ ప్రీ రిలీజ్ చేసుకుంది.  రిలీజ్ తరువాత తప్పకుండా సినిమా బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుందని అంటున్నారు.  

ఈ మూవీ రిలీజైన రెండు నెలలకు మెగాస్టార్ సైరా రిలీజ్ కాబోతున్నది.  దీనిపై కూడా అంచనాలు ఉన్నాయి.  చారిత్రాత్మక సినిమా కావడంతో రికార్డు స్థాయిలో వసూళ్లు వస్తాయని అంటున్నారు.  ఈ మూవీ కోసం మెగాస్టార్ దాదాపుగా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు.  రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించడం విశేషం.  ఈ మూవీ కూడా బాహుబలిని మించేలా ఉంటుందని, రిలీజ్ తరువాత బాహుబలి రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అని అంటున్నారు.