సైరా షూటింగ్ కు ఆగని బ్రేక్స్

సైరా షూటింగ్ కు ఆగని బ్రేక్స్
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పీరియాడిక్ వార్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఆరంభంలో ఫస్ట్ షెడ్యూల్ మాత్రమే ప్లాన్ ప్రకారం జరిగినా..ఆ తరువాత జరగాల్సిన రెండో షెడ్యూల్ కి చాలా గ్యాప్ తీసుకుని మొదలెట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా జరిగిన షెడ్యూల్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాల్గొని..తన రోల్ కి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ ను ముగించుకున్నారు. ఇందులోనే నయనతార, చిరంజీవిలపై కొన్ని కీ సీన్స్ ని కూడా చిత్రీకరించారు. తాజాగా ఈ అందుతున్న సమాచారం ఈ సినిమా షూటింగ్ మరోసారి బ్రేక్ పడిందట. ఇందుకు కారణాలు చూస్తే చిరంజీవి తన వ్యక్తిగత పనిమీద అమెరికాకు వెళాల్సి రావడంతో అంతరాయం కలుగుతోందట. దీని వల్ల జరగాల్సిన షెడ్యూల్ ఇంకాస్త ఆలస్యం అవుతున్నాయట. త్వరలో జరగనున్న కొత్త షెడ్యూల్లో మిల్క్ బ్యూటీ తమన్నా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదట్లో ఈ పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ ని సంప్రదించగా..అంగీకారం తెలపలేదని సన్నిహితవర్గాల సమాచారం.