సైరా షూటింగ్ ఎంత పూర్తయిందంటే 

సైరా షూటింగ్ ఎంత పూర్తయిందంటే 

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్వాత్యంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. వర్షాల కారణంగా కొద్దీ రోజుల పటు షూటింగ్ ను ఆపేసిన సంగతి తెలిసిందే. తాజాగానే భారీ వార్ సీన్ షూటింగ్ ను తిరిగి ప్రారంభించారని తెలుస్తోంది. 

ఇందుకోసం హైదరాబాద్ పరిసరాల్లోని కోకాపేట దగ్గర భారీ సెట్ ను నిర్మించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సైరా దాదాపు 30 శాతం షూటింగ్ పూర్తయింది. ఇప్పడు జరుగుతున్న షెడ్యూల్ ఈనెల 25 వరకు నిరవధికంగా జరగనుంది. దింతో 40 శాతం షూటింగ్ పార్ట్ పూర్తయినట్లేనని సమాచారం. ఇప్పుడు జరుగుతున్న సీక్వెన్స్ లను హాలీవుడ్ టెక్నీషియన్ల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, చిరుకి గురువు పాత్రలో మెరవనున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.