సైరా నాన్ స్టాప్ షెడ్యూల్ 

సైరా నాన్ స్టాప్ షెడ్యూల్ 

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇదివరకే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. నిన్నటి నుండే మరో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించింది. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ నిరవధికంగా దాదాపు 40 రోజుల పాటు జరగనుందని తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబద్ శివార్లలో భారీ సెట్ ను నిర్మించారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ ఈ సెట్లోనే జరగనుంది. 

ఇప్పుడు తెరకెక్కించనున్న యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ టెక్నీషియన్స్ పర్యవేక్షణలో జరగనున్నాయి. ఇందులో ప్రధాన తారాగణంపై టాకీ పార్ట్ ను సైతం షూట్ చేయనున్నారు. ఆగష్టు 22న చిరు పుట్టిన రోజు కావడంతో ఆ రోజే సైరా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలనీ చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది చివరి కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసి వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, అమితాబ్ గురువు పాత్రలో మెరవనున్నారు.