సమరానికి సిద్దమైన 'సైరా' !

సమరానికి సిద్దమైన 'సైరా' !

మెగా అభిమానులు మాత్రమే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షక లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'సైరా'.  మెగాస్టార్ చిరంజీవి నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగానే ముగిసింది.   

ఈ నెల 22న చిరు పుట్టినరోజు కావడంతో ఈ సినిమా యొక్క టీజర్ ను ఒకరోజు ముందుగానే అనగా 21వ తేదీన ఉదయం 11 గంటల 30 నిముషాలకు విడుదలచేయనున్నారు.  రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక కాగా అమితాబ్, విజయ్ సేతుపతి వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.