సైరా.. ఫిక్స్ అయ్యాడు..!!

సైరా.. ఫిక్స్ అయ్యాడు..!!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా సినిమా షూటింగ్ ను వేగవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.  రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.  పక్కా ప్లాన్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు.  
చిరు కెరీర్ లో ది బెస్ట్ చిత్రాలుగా చెప్పుకునే జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ సినిమాలు మే 9 న రిలీజ్ అయ్యాయి.  సైరా విషయంలోను అదే సెంటిమెంట్ ను ఫాలో కావాలని అనుకుంటున్నారట.  జీవితకథ ఆధారంగా రూపొందుతున్న చారిత్రాత్మకమైన సినిమా కాబట్టి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి. వీటికే ఎక్కువ సమయం పడుతుంటుంది.  పక్కా ప్రణాళికతో షూటింగ్ చేస్తూనే.. మరోవైపు కావాల్సిన గ్రాఫిక్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ను కూడా చేయించుకుంటున్నారట.  రెండింటిని సమన్వయం చేసుకుంటూ వెళ్తే.. వచ్చే ఏడాది మే 9 న రిలీజ్ చేసేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని నిర్మాతల అభిప్రాయం.  
అలా కాకుండా షూటింగ్ ఏ మాత్రం ఆలస్యం చేసినా.. అది రిలీజ్ డేట్ పై ఎఫెక్ట్ పడుతుంది.  డేట్ చేంజ్ చేయక తప్పదు.  ఇప్పటి వరకు ప్రణాళిక బద్దంగానే షూటింగ్ చేస్తున్నారట.  మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.