టీఆర్ఎస్ పాలనంతా అవినీతే..

టీఆర్ఎస్ పాలనంతా అవినీతే..

కేసీఆర్ ప్రభుత్వంపై టీ కాంగ్రెస్ నేతలు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయిన తరువాత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సమాజం బాగు కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని.. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో పూర్తిగా అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతీ స్కీమ్‌లో స్కామ్ ఉందని, టీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు, రైతులు, నిరుద్యోగ యువత, బడుగులు తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణ ఎందుకు వచ్చిందో.. ఆ లక్ష్యాన్ని కాంగ్రెస్ నెరవేరుస్తుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. 

మరోవైపు మాజీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కేసీఆర్ పెద్ద అబద్దాల కోరు, అవినీతి పరుడు, ఓ నియంత అని విమర్శించారు. ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించాలంటే క్రికెట్ లో టెస్ట్ మ్యాచ్ లా కాకుండా ట్వంటీ-ట్వంటీ మ్యాచ్ లా ఆడాలని చమత్కరించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సమిష్టిగా పోరాడేందుకు, అందరిలో ఐక్యత అవసరమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.