గెలుపు గుర్రాలకే టిక్కెట్టు: రాహుల్ గాంధీ

గెలుపు గుర్రాలకే టిక్కెట్టు: రాహుల్ గాంధీ

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. దాదాపు 3గంటల పాటు జరిగిన భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్‌ అలీ, డీకే అరుణ, రేవంత్‌రెడ్డి, సంపత్‌ తదితరులు పాల్గోన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. పొత్తుల వ్యవహారం, అభ్యర్థుల ఎంపికపైనా చర్చించారు. తెలంగాణ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తామని రాహుల్ అన్నారు. కచ్చితంగా గెలిచే సీట్ల విషయంలో రాజీపడొద్దని పార్టీ నాయకులను ఆయన ఆదేశించారు. పొత్తు, అభ్యర్థుల విషయంలో ఎవరూ బాహాటంగా మాట్లాడవద్దని, ఏవైనా సమస్యలుంటే ఇన్‌ఛార్జితో గానీ తనతో గానీ నేరుగా మాట్లడవచ్చని రాహుల్‌ టీ కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు.