వన్డే జట్టులోకి వచ్చిన హైదరాబాద్ క్రికెటర్...

వన్డే జట్టులోకి వచ్చిన హైదరాబాద్ క్రికెటర్...

ఐపీఎల్ 2020 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అద్భుతంగా రాణించి వెలుగులోకి వచ్చిన ఆటగాడు టి నటరాజన్‌. అయితే ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళాల్సి ఉండటంతో అప్పుడు బీసీసీఐ మూడు ఫార్మాట్లలో జట్లను ప్రకటించింది. కానీ మొదట ఈ జట్టులో కూడా నటరాజన్‌ కు సి;హోతు దక్కలేదు. కానీ తర్వాత ఎంపిక చేసిన ఆటగాళ్ల గాయాలను పరిశీలించిన బీసీసీఐ కొన్ని మార్పులు చేస్తూ మళ్ళీ రెండోసారి జట్లను ఎంపిక చేసింది. అప్పుడు టీ 20 జట్టుకు ఎంపికైన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని గాయం కారణంగా తప్పించి నటరాజన్‌ పొట్టి ఫార్మటు లోకి తీసుకున్నారు. దాంతో ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టుతో కలిసి ఆసీస్ టూర్ కు వెళ్ళాడు. అయితే ఈ రోజు ఆసీస్-భారత్ మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరుగుతుంది. దాంతో భారత్ మొదటి వన్డేకు 15 మంది ఆటగాళ్లతో కూడిన తమ జట్టును ప్రకటించింది. అందులో టి నటరాజన్ పేరు కూడా ఉంది. ఎందుకంటే... వన్డే టీం లో ఎంపికైన నవదీప్ సైనికి చిన్న గాయం కావడంతో...అతను ఏ మ్యాచ్ లోనైనా జట్టు నుంచి  తప్పుకునే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా వన్డే జట్టులోకి నటరాజన్ ను తీసుకుంది బీసీసీఐ. అయితే టీం లోకి వచ్చినా... నటరాజన్ మాత్రం తుది జట్టులోకి ఎంపిక కాకపోవడంతో బెంచ్ కే పరిమితమయ్యాడు.