ఇవాళే డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై ప్రకటన

ఇవాళే డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. విపక్షాల మద్దతుతో ఈ పదవి మాజీ మంత్రి టీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే, టీ.పద్మారావుగౌడ్‌ను వరించింది. ఇందుకు సంబంధించి శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ సభలో అధికారిక ప్రకటన చేయనున్నారు. డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియలో భాగంగా శనివారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావుగౌడ్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌, ఎంఐఎం, బీజేపీ ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపాయి.