ఇవాళ్టి నుంచి టీ20 సూపర్‌ఫైట్‌

ఇవాళ్టి నుంచి టీ20 సూపర్‌ఫైట్‌

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను 4-1తో దక్కించుకున్న టీమిండియా ఇప్పుడు టీ20ల్లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఇవాళ ప్రారంభం కానుంది. చివరి వన్డే జరిగిన వెస్ట్‌ప్యాక్‌ మైదానంలోనే ఈ ఆరంభ మ్యాచ్‌ జరుగనుంది. విరాట్‌ కోహ్లికి విశ్రాంతితో సారథ్యంతో పాటు బ్యాటింగ్‌లోనూ రోహిత్‌ శర్మ మెరవాల్సి ఉంటుంది. వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై టి20 సిరీస్‌లకు తప్పించినమహేంద్ర సింగ్‌ ధోని పొట్టి ఫార్మాట్‌లో ఇవాళ్టి మ్యాచ్‌తో పునరాగమనం చేయనున్నాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఈసారి ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరం కానుంది.  

వన్డే సిరీస్‌ను తమ చెత్త ఆటతో కోల్పోయిన న్యూజిలాండ్‌.. ఈసారి అలాంటి తప్పిదాలకు తావీయకూడదనుకుంటోంది. ఓపెనర్‌ గప్టిల్‌ గాయపడడంతో అతని స్థానంలో కెప్టెన్‌ విలియమ్సన్‌ ఓపెనింగ్‌ చేయబోతున్నాడు. కొలిన్‌ మన్రో, రాస్‌ టేలర్‌, జేమ్స్‌ నీషమ్‌పై జట్టు ఎక్కువగా ఆధారపడి ఉంది. బౌలర్లు టిమ్‌ సౌథీ, ఫెర్గూసన్‌ ఈ విభాగంలో కీలకం కానున్నారు. ఓవరాల్‌గా కివీస్‌తో భారత్‌ ఎనిమిది టీ20లు ఆడితే రెండు మాత్రమే గెలిచి ఆరింట్లో ఓడింది. దీంతో.. ఆ చెత్త రికార్డును చెరిపేయాలని చూస్తోంది. 

భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధవన్‌, గిల్‌, ధోనీ, పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, క్రునాల్‌ పాండ్యా/కేదార్‌ జాదవ్‌, భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌/సిద్ధార్థ్‌ కౌల్‌, చాహల్‌/కుల్దీప్‌
న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), మన్రో, టిమ్‌ సీఫెర్ట్‌, టేల ర్‌, డారిల్‌ మిచెల్‌, నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌, స్కాట్‌ కుగెలిన్‌, బ్రేస్‌వెల్‌, సౌథీ, ఫెర్గూసన్‌/టిక్నెర్‌, సోధీ