టీ20 ప్రపంచ కప్పు వాయిదా!..కారణం ఇదేనా..!
కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని క్రీడలను ప్రభుత్వాలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే...ప్రపంచంలో ఎక్కువ మంది చూసే క్రికెట్కు కరోనా దెబ్బ తగులుతోంది...తాజాగా ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సిన టీ20 వరల్డ్కప్ 2022 వరకూ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయని ఐసీసీ వర్గాలు చెపుతున్నాయి...ఐసీసీ అధికారింగా ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని, ఈ నెల 28న అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో సమావేశంకానున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తుది నిర్ణయం తీసుకోనుంది...
ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18 నుంచి టీ20 వరల్డ్కప్ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియాలో సెప్టెంబరు వరకూ పర్యాటక వీసాల్ని రద్దు చేశారు... దాంతో.. టీ20 వరల్డ్కప్ జరగడంపై సందిగ్ధత నెలకొనగా..ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ వాయిదా చర్చ వల్ల క్రికెట్ అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)