లిప్ కిస్ సీన్స్ చేస్తా అన్నా... అలాంటి పాత్రలు ఇవ్వడం లేదట..!!

లిప్ కిస్ సీన్స్ చేస్తా అన్నా... అలాంటి పాత్రలు ఇవ్వడం లేదట..!!

సొట్ట బుగ్గల తాప్సి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి గ్లామర్ రోల్స్ చేసి.. అక్కడి నుంచి బాలీవుడ్ కు వెళ్ళింది.  బాలీవుడ్ లో మాత్రం ఆమెకు గ్లామర్ రోల్స్ ఇవ్వడం లేదు.  అన్ని పెర్ఫార్మన్స్ కు ప్రాధాన్యత కలిగిన సినిమాలు మాత్రమే వస్తున్నాయి. బాలీవుడ్ లో గ్లామర్ రోల్స్ చేస్తానని చెప్పినా వినడం లేదట.  తనను బాలీవుడ్ దర్శక నిర్మాతలు అలా చూడటం లేదని, పెర్ఫార్మన్స్ చేసే నటిగా మాత్రమే చూస్తున్నారని అంటోంది.  

తెలుగులో గ్లామర్ పాత్రలు చేసినట్టు చెప్పిన తాప్సి, గేమ్ ఓవర్ కోసం వీల్ చైర్ లో ఎలా ఉండాలో.. ఎలా కూర్చోవాలో నేర్చుకొని కూర్చున్నట్టు చెప్పింది.  వీల్ చైర్ లో కూర్చొని నటించడం చాలా కష్టం అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.  అశ్విన్ శరవణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 14 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.