వైరల్: పార్లమెంట్ లో పంది మాంసంతో కొట్టుకున్న ఎంపీలు... 

వైరల్: పార్లమెంట్ లో పంది మాంసంతో కొట్టుకున్న ఎంపీలు... 

ప్రజాసమస్యలపై చర్చించి చట్టాలు చేసే ఎంపీలు పార్లమెంట్ లో బాక్సర్లుగా మారిపోయారు.  ప్రతిపక్ష పార్టీ ఎంపిలు పంది మాంసంతో అధికార పార్టీ ఎంపీలపై విరుచుకుపడ్డారు.  తిట్టుకోవడం,ప్లకార్డులతో నిరసనలు తెలియజేయడం వరకు ఓకే. కానీ, ఇలా తన్నుకోవడం అన్నది విచిత్రం.  అదీ కూడా పందిమాంసాన్ని విసురుకుంటూ పిడిగుద్దుల వర్షం కురిపించారు.  ఈ సంఘటన తైవాన్ పార్లమెంట్ లో జరిగింది.  తైవాన్ ప్రభుత్వం పందిమాంసం పాలసీపై కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.  అమెరికా దిగుమతి చేసుకునే పందిమాంసంపై ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయించింది.  దీనికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది.  ఈ బిల్లుపై చర్చ జరిగే సమయంలో ప్రతిపక్ష పార్టీ ఎంపీలు పందిమాంసాన్ని విసిరేస్తూ నిరసనలు తెలిపారు.  ఈ నిరసనలు శృతిమించి కొట్టుకునే వరకు వెళ్ళింది.  అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పందిమాంసంపై తైవాన్ లో ఆంక్షలు ఉన్నాయి.  ఇప్పుడు ఆంక్షలను ఎత్తివేస్తే అమెరికాతో సంబంధాలు పెరుగుతాయని అక్కడి ప్రభుత్వం భావించింది.  ఆగష్టు లో దీనికి సంబంధించిన ప్రతిపాదనను తీసుకొచ్చింది.  ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తే... జనవరి నుంచి అమలులోకి తీసుకురావాలని అనుకుంది ప్రభుత్వం.