దేశం గర్వించేలా సీఎం కేసీఆర్ పాలన

   దేశం గర్వించేలా సీఎం కేసీఆర్ పాలన

హైదరాబాద్ లోని జలవిహార్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సనత్‌నగర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో మంత్రి ఈ ఆత్మీయ భేటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, దేశం గర్వించేలా సీఎం కేసీఆర్ పాలన సాగుతుందని పేర్కొన్నారు. ఎన్నిజన్మలు ఎత్తినా.. కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. మీలో ఒకడిగా ఉంటూ మీకు సహాయం అందిస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని పొగిడిందని, అందరు మన ప్రభుత్వ పథకాలు ప్రశంసిస్తున్నారని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పర్యటించి.. అక్కడి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని ప్రకటించారు. కార్యకర్తలకు ఏ కష్టం నష్టం వచ్చినా వారిని నా భుజస్కంధాలపై వేసుకుంటానని మంత్రి తలసాని తెలిపారు. ఈ కార్యక్రమానికి బండా ప్రకాశ్, కాలేరు వెంకటేశ్, అంజయ్య యాదవ్, భేతి సుభాష్, బాబురావు, ప్రభాకర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్, కార్పొరేటర్లు హాజరయ్యారు.