అద్భుతాలకు ఎన్నో అవకాశాలు...

అద్భుతాలకు ఎన్నో అవకాశాలు...

కృష్ణా, గోదావరి జలాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటాం... రాబోయే కాలంలో అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉందన్న ఆయన... ఫిషరీస్ డిపార్ట్మెంట్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని... తెలంగాణ నుంచి ఇతర రాష్టాలకు చేపలను ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. మత్స్యకారులను అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని వెల్లడించిన తలసాని... 30 లక్షల మత్స్యకారల కుటుంబాలు రాష్ట్రంలో ఉన్నాయని... గత ప్రభుత్వాలు మత్స్య శాఖను పట్టించుకోలేదన్నారు. 

కేసీఆర్ ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు... చేతల్లో చూపిస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... మొదట్లో 22 కోట్లు, తరువాత 50 కోట్ల, ఇప్పుడు 70 - 80 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయాలని భావిస్తున్నామన్నారు. ఆక్వా జోన్‌లు నిర్మిస్తాం, ఫిష్ యూనివర్సిటీలు రెండు ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు తలసాని. మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని... 24 గంటల కరెంట్ సరఫరా చేస్తూ దేశంలోనే రికార్డు సాధించామన్నారు. మత్స్యకారులకు ఫీడ్, వాహనాలు ఉచితంగా కేటాయిస్తామని ప్రకటించారు. కేజ్ కల్చర్ ను ప్రమోట్ చేస్తే మంచి ఫలితాలు వచ్చాయని గుర్తు చేసిన తలసాని... మత్స్య రంగంలో తెలంగాణ... దేశంలో నంబర్ వన్ కాబోతోందన్నారు. చేపల మార్కెట్‌కు కొన్ని ఇబ్బందులున్నా... మత్స్య రంగానికి రూ. 101 కోట్ల బడ్జెట్ పెట్టి... అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు.