కుమారుడి గెలుపు కోసం తండ్రి ప్రచారం

కుమారుడి గెలుపు కోసం తండ్రి ప్రచారం

సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. తలసాని సాయికిరణ్ యాదవ్ కు మద్దతుగా ఆయన తండ్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్ లోని మక్తాలో రోడ్ షో నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్ధి సాయికిరణ్ యాదవ్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం ఫిల్మ్ నగర్‌లోని ఎఫ్ఎన్ సీసీ క్లబ్‌లో ఆ క్లబ్ సభ్యులు, చలన చిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు, చిత్రపురి హిల్స్ కాలనీ సభ్యులతో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌తో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తన కుమారుడు సాయిని అత్యధిక మెజార్టీతో సికింద్రాబాద్ ఎంపీగా గెలిపించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.