దేవదాస్ ఎలా ఉందంటే..!!

దేవదాస్ ఎలా ఉందంటే..!!

నాగ్, నాని ల మల్టి స్టారర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది.  ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో ప్రీమియర్ షోలు ముగిశాయి.  ప్రీమియర్ టాక్ పాజిటివ్ గా ఉండటంతో వైజయంతి మూవీస్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.  ముందురోజే నాగ్ ఈ సినిమా గురించి చేసిన ట్వీట్ అందరిని ఆశ్చర్యపరిచింది.  

ఫ్యామిలీతో కలిసి సినిమా చూశానని, తన పాకెట్ లో మరో హిట్ వచ్చిందని చెప్పి ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్ తో నాని కూడా సంబరపడ్డాడు.  నిన్నటి వరకు చిన్న టెన్షన్ ఉండేదని, ఇప్పుడు ఆ టెన్షన్ పోయిందని అన్నారు.  ప్రేక్షకులతో కలిసి థియేటర్ లో సినిమా చూస్తానని చెప్పాడు. 

ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో నాగ్, నాని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  మొదటి నుంచి ఈ సినిమాకు పాజిటివ్ బజ్ నడుస్తుండటం, అది ఇప్పుడు నిజం కావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.  మరోవైపు లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మికకు ఈ సినిమా ద్వారా మూడో విజయం లభించినట్టు అవుతుంది.