మహేష్ కోసం తమన్నా రెడీగా ఉందట..!!

మహేష్ కోసం తమన్నా రెడీగా ఉందట..!!

మహేష్ బాబు సినిమాల్లో ఇంట్రో సాంగ్ ను లావిష్ గా, అద్భుతంగా చిత్రీకరిస్తుంటారు. పోకిరి నుంచి ఇలానే జరుగుతున్నది.  ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్నారు.  ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతున్నది. మహేష్ బాబు ఇందులో ఆర్మీ మేజర్ గా కనిపిస్తున్నారు.  ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మిస్తున్నారు.  మహేష్ కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నది.  

ఇదిలా ఉంటె, ఈ మోవి ఇంట్రో సాంగ్ లో మహేష్ తో కలిసి తమన్నా స్టెప్పులు వేయబోతున్నది.  అనిల్ రావిపూడి ఫోన్ చేసి చెప్పగానే వెంటనే ఒకే చేసిందట.  తనకు స్టెప్స్ వేయడం అంటే మహా ఇష్టం అని, ఎఫ్ 2 వంటి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి కలిసి పనిచేయడం హ్యాపీ గా ఉంటుందని చెప్పింది. అలానే మహేష్ తో కలిసి ఆగడు సినిమా చేసింది.  అయితే, ఆ మూవీ ఫెయిల్ కావడంతో మరో సినిమాలో కలిసి నటించలేదు.  కలిసి సినిమాలో నటించకపోయినా.. ఓ స్పెషల్ సాంగ్ లో కలిసి నర్తించడబోతుండటం హ్యాపీగా ఉందని చెప్పింది తమన్నా.  దేవిశ్రీ ప్రస్తుతం ఈ సాంగ్ ను కంపోజ్ చేస్తున్నారట.  త్వరలోనేసాంగ్ ను షూట్ చేస్తారని సమాచారం.