తమన్నాకు ముందు ముగ్గురు రిజక్ట్ చేశారు

తమన్నాకు ముందు ముగ్గురు రిజక్ట్ చేశారు

గతంలో ఐటమ్స్ సాంగ్స్ చేయడానికి ప్రత్యేకంగా కొంతమంది ఉండేవారు.  కానీ, ఇప్పుడు ఐటమ్స్ సాంగ్స్ లో హీరోయిన్స్ చేస్తున్నారు.  సుకుమార్ ఈ తరహా వాటికి తెరతీశారు. ప్రస్తుతం నాగ చైతన్య - చందు మొండేటి కాంబినేషన్లో సవ్యసాచి సినిమా వస్తోంది.  ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందట.  ఈ సాంగ్ కోసం చిత్ర నిర్మాతలు చాలా మందిని సంప్రదించారు.  మొదట ఈ సినిమాలో ఐటమ్ సాంగ్స్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.  

ముందుగా నిర్మాతలు రకుల్ ప్రీత్ ను అనుకున్నారు.  కానీ, ఈ సినిమాలో స్టెప్స్, మూమెంట్స్ కాస్త వెరైటీగా ఉండటంతో ఆమె సెట్ కాదనుకొని కాజల్ ను సంప్రదిస్తే.. కాజల్ నో చెప్పేసింది.  రాశి ఖన్నా కూడా అలాగే చెప్పింది.  ఆ తరువాత ఇలియానాను కూడా సంప్రదించారు.  ఎలాగో ఇలియానా మైత్రి మూవీ మేకర్స్ రవితేజతో ఓ సినిమా చేస్తోంది కాబట్టి ఒప్పుకుందని అనుకున్నారు.  హీరోయిన్ గా మాత్రమే చేస్తానని చెప్పడంతో.. ఆమెను పక్కన పెట్టారు.  శృతి హాసన్ ను సంప్రదిస్తే.. ఆమె ఏమి చెప్పలేదట.  దీంతో చేసేది లేక తమన్నాను సంప్రదించారు.  

తమన్నా కొన్ని షరతులు పెట్టింది.  అంతేకాదు, తమన్నా ఈ సాంగ్ లో నటించడానికి ఏకంగా రూ.60 లక్షలు డిమాండ్ చేసిందని వార్తలు వచ్చాయి.  ఆమె అడిగినంత ఇచ్చేనందుకు మైత్రి మూవీ మేకర్స్ ఓకే చేసిందట.  ఇప్పటికే తమన్నా చాలా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది.