పాక్ క్రికెటర తో రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన తమన్నా...

పాక్ క్రికెటర తో రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన తమన్నా...

ఎవరైనా ఇద్దరు సెలబ్రెటీలు ఒక దగ్గర కనిపిస్తే చాలు వారిపైన రకరకాల గాసిప్స్ మొదలవుతాయి. వారు రిలేషన్ లో ఉన్నారని లేక పెళ్లి చేసుకొబోతున్నారని వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే అలాంటి సంఘటనే ఒకటి తమన్నా జీవితం లో జరిగింది. అదేంటంటే.. తమన్నాతో పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో షాపింగ్ చేస్తున్న పాత ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దుబాయ్ లో ఓ బంగారం షాపు ప్రారంభోత్సవానికి వీరిద్దరూ ప్రముఖ అతిథులుగా వచ్చారు. దాంతో అందరికి జరిగినటే తమన్నాకు జరిగింది. వారిద్దరికి రకరకాల సంబంధాలు అంటగట్టారు. అయితే ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయం పై స్పందించిన తమన్నా అందరికి క్లారిటీ ఇచ్చింది. తనకు ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు ఇవ్వని పుకార్లే అని ఆ వార్తలను కొట్టిపారేసింది. అయితే తమన్నా ప్రస్తుతం గోపిచంద్ హీరోగా వస్తున్న సీటిమార్ సినిమాలో తెలంగాణ కబడ్డీ జట్టుకు కోచ్ గా నటిస్తుంది. అయితే చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.