రేపిస్టుల‌కు థెర‌పీ చేయాలి- త‌మ‌న్నా

రేపిస్టుల‌కు థెర‌పీ చేయాలి- త‌మ‌న్నా
``జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి తెగ‌బ‌డ్డారు. 16ఏళ్ల టీనేజీ అమ్మాయిని రేప్ చేసి, అడ్డుత‌గిలిన తండ్రిని చావ‌బాదారు. రేపిస్టును కాపాడేందుకు సాగిన దొంగాట‌కం ఇది. దేశాన్ని సంస్క‌ర‌ణ‌ల‌తో స‌మూలంగా మార్చే ముందు ఇంకెంత‌మంది నిర్భ‌య‌లు బ‌లి కావాలి?`` అంటూ ఎంతో ఉద్వేగంగా ప్ర‌శ్నించారు మేటి క‌థానాయిక‌ త‌మ‌న్నా. దేశంలోని అవ్య‌వ‌స్థ‌ను, మాన‌వ‌త్వాన్ని మంట‌క‌లుపుతున్న‌ రేపిస్టుల‌ పైశాచిక‌త్వాన్ని త‌న‌దైన శైలిలో తూర్పార‌బ‌ట్టారు. ట్విట్ట‌ర్ మాధ్య‌మంలో త‌మ‌న్నా ప్ర‌శ్న‌లు ప్ర‌స్తుతం సినిమా వ‌ర్గాలు స‌హా స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చాయి. ఇలాంటి ప్ర‌మాద‌క‌ర మెంటాలిటీ ఉన్న వారికి థెర‌పీ ఇవ్వాల‌ని త‌మ‌న్నా అన్నారు. దేశంలో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు బ‌ల‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు లేవ‌ని ప‌రోక్షంగా త‌మ‌న్నా అభిప్రాయ ప‌డ్డారు. దేశ‌వ్యాప్తంగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏదో ఒక మూల ఇలాంటి దారుణాలు అనునిత్యం జ‌రుగుతూనే ఉన్నాయి. దీనిపై త‌మ‌న్నా వంటి సెల‌బ్రిటీలు గొంతెత్తుతూనే ఉన్నారు. అయితే ఇలాంటి అమానుషాల్ని అరిక‌ట్టేందుకు సౌదీ త‌ర‌హా క‌ఠిన‌చ‌ట్టాల్ని ప్ర‌జా`స్వామి`క‌ భార‌త్‌లో తేగ‌ల‌రా?