డబుల్ అంమౌంట్ ఇవ్వలేదంటున్న తమన్నా
కొన్నేళ్లపాటు తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగిన తమన్నా ప్రస్తుతం కూడా చేతి నిండా సినిమాలతో బిజీగానే ఉంది. ఈమధ్య హిందీ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టిన ఆమె అక్కడే సెటిలైపోవాలని చూస్తున్నట్టు వార్తలొచ్చాయి. అందుకోసమే ముంబైలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఖరీదైన ఫ్లాట్‌ను ఆమె కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి.
అయితే ఆ ఫ్లాట్ కోసం తమన్నా డబుల్ అమౌంట్ చెల్లించినట్టు మీడియా తెగ హడావుడి చేసింది. కానీ తమన్నా స్పందిస్తూ తాను ముంబైలో ఫ్లాట్ కొన్న మాట వాస్తవమే కానీ డబుల్ అమౌంట్ పెట్టి కొనలేదు. అయినా అంత అవసరం నాకు లేదు. అందరూ చెల్లించే ధరనే చెల్లించాను. ఫ్లాట్ పనులు పూర్తవగానే అమ్మానాన్నతో కలిసి అక్కడికి షిఫ్ట్ అవుతాను అంతో క్లారిటీ ఇచ్చింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)