ప్రేమకు నో ఛాన్స్ అంటున్న స్టార్ హీరోయిన్ !

ప్రేమకు నో ఛాన్స్ అంటున్న స్టార్ హీరోయిన్ !

 

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో తమన్నా కూడా ఉంది. 14 ఏళ్ల క్రితం తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ మిల్కీ బ్యూటీకి ప్రస్తుతం వయసు 29 ఏళ్లు.  ఈమె పెళ్లి గురించి తరచూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది.  కొన్నిరోజుల క్రితం కూడా ఆమెకు పెళ్లి సెట్టైందని వార్తలొచ్చాయి.  కానీ వాటిలో నిజం లేదన్న తమన్నా తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని, తన పెళ్లి భాద్యత పూర్తిగా తల్లిదండ్రులకి అప్పగించేశానని చెప్పుకోచ్చింది.  ఇక ఇటీవలే 'ఎఫ్ 2' సినిమాతో భారీ హిట్ అందుకున్న ఆమె 'సైరా'లో నటిస్తూనే కొరటాలతో చిరు చేయనునం మరొక సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది.