అవి లేకుండా తమన్నా ఒక్కరోజు కూడా ఉండలేదట..!! 

అవి లేకుండా తమన్నా ఒక్కరోజు కూడా ఉండలేదట..!! 

మిల్కి బ్యూటీ తమన్నా శ్రీ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.  శ్రీ కంటే ముందు ఈ అమ్మడు స్కూల్ చదివే రోజుల్లో ఫెయిర్ అండ్ లవ్ లీ యాడ్ లో నటించే ఛాన్స్ వచ్చింది.  దాని తరువాత ఈ అమ్మడు.. చాంద్ షా రోషన్ చోప్రా సినిమాలో నటించింది.  ఆ తరువాతే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.  

శ్రీ సినిమా పెద్దగా మెప్పించలేదు.  హ్యాపీడేస్ సినిమా ఆమె కెరీర్ను మలుపుతిప్పింది.  అప్పటి నుంచి వరసగా సినిమాలు చేస్తున్న తమన్నా ప్రభాస్ బాహుబలి సినిమాతో మంచిపేరు తెచ్చుకుంది.  గ్లామర్ పాత్రలు చేస్తూనే ఇలా సాహసవంతమైన పాత్రలు కూడా చేస్తూ మెప్పిస్తున్నది ఈ అమ్మడు.  ఇప్పుడు ఈ హీరోయిన్ మెగాస్టార్ సైరా సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నది.  దీంతో పాటు హర్రర్ సినిమాలు చేస్తూ బిజీగా మారింది.  ఉదయం లేచిన వెంటనే గోరు వెచ్చని నీరు, నిమ్మరసం, తప్పనిసరిగా తీసుకుంటుందట.  జిమ్ కు వెళ్లి వర్కౌట్ పూర్తయ్యాక కాఫీ లాంగించేస్తుందట. అలానే ఉదయం లంచ్ వెజ్ తీసుకున్నా సాయంత్రం డిన్నర్లో మాత్రం తప్పనిసరిగా గ్రిల్డ్ చికెన్, చేపలు, కాయకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటుంటుందట తమన్నా.  ఇవి లేకుండా సాయంత్రం భోజనం చేయనని అంటోంది తమన్నా.