తమన్నాకి పెద్ద కోరికలే ఉన్నాయి

తమన్నాకి పెద్ద కోరికలే ఉన్నాయి

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దం దాటుతున్నా ఇప్పటికీ క్రేజ్ తగ్గకుండా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ తమన్నా.  ప్రస్తుతం ఆమె చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి.  అయితే తన సినీ కెరీర్లో రెండు కోరికలు ఉన్నాయని అంటోంది తమన్నా.  వాటిలో ఒకటి పూర్తిస్థాయి డాన్స్ బేస్డ్ మోబీవీలో నటించడం కాగా ఇంకొకటి బయోపిక్ చేయడం.  అయితే ఆ బయోపిక్ సాదా సీదా వ్యక్తిది కాదు.. దివంగత నటి శ్రీదేవిది.  తనకు శ్రీదేవి అంటే చాలా ఇష్టమన్న మిల్కీ బ్యూటీ ఎప్పటికైనా ఆమె బయోపిక్ చేయాలని ఉందని మనసులో మాటను బయటపెట్టింది.  మరి ఆమె కోరికలు ఎప్పటికి నెరవేరుతాయో చూడాలి.