ఈసారి దెయ్యం తమన్నా

ఈసారి దెయ్యం తమన్నా

 

ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన 'రాజుగారి గది' మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.  ఈ హర్రర్ డ్రామాలో గోస్ట్ పాత్రను పూర్ణ చేసింది.  దానికి కొనసాగింపుగా వచ్చిన 'రాజుగారి గది 2'లో ఆ పాత్రను సమంత చేయడం జరిగింది.  కానీ ఏ చిత్రం అంతగా మెప్పించలేకపోయింది.  ప్రస్తుతం ఈ ప్రాంచైజీలో 'రాజుగారి గది 3' రానుంది.  ఇందులో దెయ్యం పాత్రను మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తోంది.  ఈరోజే చిత్రం లాంచ్ అయింది.  త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.