నెగెటివ్ పాత్రలో మిల్కీ బ్యూటీ !

నెగెటివ్ పాత్రలో మిల్కీ బ్యూటీ !

'ఎఫ్ 2' ఇచ్చిన విజయంతో తమన్నాకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.  ఇప్పటికే 'దేవి 2, థట్ ఈజ్ మహాలక్ష్మి' సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తున్న ఆమె తాజాగా విశాల్ హీరోగా రూపొందనున్న కొత్త సినిమాకి సైన్  చేశారు.  కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ పాత్రకు కొంచెం నెగెటివ్ షేడ్స్ ఉంటాయట.  ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ మైండ్ గేమ్ ఆడే అమ్మాయి పాత్రట.  ఈ పాత్ర అంత సులభంగా ఉండదని, తనలోని నటికి ఇదొక పరీక్షని అంటోంది తమన్నా.