చిరంజీవికి జోడీగా తమన్నా ?

చిరంజీవికి జోడీగా తమన్నా ?

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చిరంజీవి యొక్క 'సైరా' సినిమాలో ఒక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.  దీని తరవాత వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా చేస్తున్నారని వినికిడి.  అదే చిరు 152వ చిత్రం.  ఈ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేయనున్నాడు. 

గతంలో చిరు 'రచ్చ' ఆడియో వేడుకలో తమన్నాతో కలిసి నటించాలని ఉందని సరదాకు ఒక మాట అన్నారు. ఆ మాట ఈ సినిమా రూపంలో త్వరలోనే నిజమవుతుందని అనిపిస్తోంది.  ఇక తమన్నా విషయానికొస్తే  చిరుతో సినిమా అంటే ఆమె మాత్రం కాదని అంటుందా ఏంటి.