కుక్కపిల్ల కోసం పెద్ద త్యాగం చేసిన తమన్నా !

కుక్కపిల్ల కోసం పెద్ద త్యాగం చేసిన తమన్నా !

తమన్నా స్వతహాగా జంతువులంటే చాలా ఇష్టం.  ముఖ్యంగా పెంపుడు జంతువులంటే ఆమెకు మరీ ఇష్టం.  ఆమె పెంచుకునే కుక్కపిల్లల్లో ఒకదానికి పెరాలసిస్ సోకడంతో మనస్థాపం చెందిన తమన్నా ఆ కుక్కపిల్ కోలుకునే వరకు తనకిష్టమైన మాంసాహారాన్ని మానేస్తానని ఒట్టు పెట్టుకుందట. 

అనూహ్యంగా కుక్కపిల్ల కోలుకోవడం మొదలుపెట్టిందట.  దాంతో తమన్నా ఇకపై జీవితంలో అసలు మాంసాహారాన్నే ముట్టుకోకూడదని నిర్ణయించుకుందట.  ఇలా తనకెంతో ఇష్టమైన మాంసాహారాన్ని వదులుకోవడం కష్టంగానే ఉన్నా పూర్తిగా శాఖాహారిగా మారుతున్నందుకు సంతోషంగా కూడ ఉందని చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ.