కేరళ బాధితులకు విజయ్ భారీ విరాళం

కేరళ బాధితులకు విజయ్ భారీ విరాళం

కేరళను వరదలు ముంచెత్తుతున్నాయి.  వారం రోజులు గడుస్తున్నా.. వరద ఉదృతి ఇంకా తగ్గలేదు.  భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా.. డ్యామ్ లు నిండిపోవడంతో పాటు వరదనీరు భారీగా వచ్చి చేరుతుండటంతో.. నీటిని కిందకు వదులుతున్నారు. వరదనీరు, డ్యామ్ లనుంచి వస్తున్న నీటితో కేరళలోని 14 జిల్లాలు ముంపుకు గురయ్యాయి.  చాలా ప్రాంతాలకు కమ్యూనికేషన్ లేదు. 

కేరళను ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు అనేక మంది సినీస్టార్లు ముందుకు వచ్చి విరాళాలు అందించారు.  అందిస్తున్నారు.  తాజా సమాచారం ప్రకారం తమిళ హీరో విజయ్ కేరళకు రూ.14 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని అందించినట్టుగా తెలుస్తుంది.  విజయ్ లాగానే మిగతా నటులకు కూడా ముందుకు వచ్చి విరాళాలు అందిస్తే.. కేరళ ఆర్ధికంగా బయటపడుతుంది.  మరో సినీనటుడు ఉదయనిధి స్టాలిన్ కేరళ బాధితుల కోసం రూ.10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు.