ఆసుపత్రిలో చేరిన నటి కుష్బూ

ఆసుపత్రిలో చేరిన నటి కుష్బూ

తమిళ నటి, కాంగ్రెస్ ప్రచారకర్త కుష్బూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజున అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఓ ఫోటోను తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్య పదవిలో ఉన్న తాను లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో టీవీ చర్చల్లో పాల్గొనవలసి ఉండగా ఇలా ఆస్పత్రిలో చేరడం బాధగా ఉందని పేర్కొన్నారు.