తమిళ ఫేమస్ నటుడు క్రేజీ మోహన్ ఇకలేరు..!!

తమిళ ఫేమస్ నటుడు క్రేజీ మోహన్ ఇకలేరు..!!

తమిళ ప్రఖ్యాత నటుడు, స్రీన్ ప్లే రైటర్, డైలాగ్స్ రైటర్ క్రేజీ మోహన్ ఈ రోజు మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు.  సడెన్ గా ఆయనకు గుండెపోటు రావడంతో కావేరి హాస్పిటల్ కు తీసుకెళ్లారు.  అక్కడ డాక్టర్లు ఆయనకు బ్రతికించేందుకు తీవ్రంగా కృషి చేశారు.  కానీ లాభంలేకపోయింది.  

క్రేజీ మోహన్ మోహన్ గుండెపోటుతో మరణించాడనే వార్త తెలుసుకున్న తమిళ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది.  ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.  తమిళంలో కమల్ హాసన్ నటించిన ఎన్నో సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేశారు.  శంకర్ ఇండియన్ సినిమాకు ఆయనే డైలాగులు అందించారు.