ప్రశాంత్ వర్మకు తమిళ హీరో ఆఫర్ ?

ప్రశాంత్ వర్మకు తమిళ హీరో ఆఫర్ ?

'అ !' సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.  ప్రస్తుతం ఈయన తన రెండవ సినిమాగా రాజశేఖర్ ప్రధాన పాత్రలో 'కల్కి' అనే చిత్రం చేశారు.  ఈ సినిమా ట్రైలర్ అమితంగా ఆకట్టుకోవడంతో అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి.  ముఖ్యంగా ఆయన టేకింగ్ పట్ల ఎందరో ఇంప్రెస్ అయ్యారు.  దీంతో పలువురు హీరోలు ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తిచూపుతున్నారట.  వారిలో తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ఉన్నాడట.  ప్రస్తుతం వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రాజెక్ట్ ఉందా లేదా అనేది తెలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.