'హీరో'ని కడసారి చూసేందుకు హీరోల క్యూ..

'హీరో'ని కడసారి చూసేందుకు హీరోల క్యూ..

కలైంజర్ కరుణానిధి తమిళులకు రాజకీయ దురంధరుడైతే.. ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్మేవారికి మాత్రం హీరో అనే చెప్పాలి.  అంతలా ద్రవిడ సిద్ధాంతాన్ని తనలో ఇముడ్చుకున్నారాయన. ఆయన మరణంతో డిఎంకె శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి.  వేలాది మంది అభిమానులు తమ హీరోను కడసారి చూసుకునేందుకు రాజాజీ హాల్ వైపుకు నడుస్తుండగా తమిళ సినీ పరిశ్రమ సైతం తమ రచయిత కడసారి చూపు కోసం కదిలింది.

ఇప్పటికే రజనీకాంత్‌, కమల్ హాసన్, అజిత్, శివకార్తికేయన్, నాజర్, ప్రభు, సత్యరాజ్, సూర్య, విజయ్ సేతుపతి, వడివేలు వంటి స్టార్ నటులు షూటింగ్ పనులన్నీ ఆపుకుని కరుణను సందర్శించుకోగా మిగిలిన హీరోలు కూడ ఒక్కొక్కరుగా వీడ్కోలు పలికేందుకు పయనమవుతున్నారు.