ఆర్ఆర్ఆర్ సినిమాను తమిళ్ లో షూట్ చేస్తున్నారా? డబ్ చేస్తున్నారా?

ఆర్ఆర్ఆర్ సినిమాను తమిళ్ లో షూట్ చేస్తున్నారా? డబ్ చేస్తున్నారా?

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  ఇక లీకేజీ దొరికితే దానిని ట్రెండ్ చేసే విధానం వేరుగా ఉంటోంది.  అసలే ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు.  అప్పుడెప్పుడో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.  ఆ తరువాత ఎలాంటి పోస్టర్ లేదు.  ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్నారు. 

ఇక ఇదిలా ఉంటె ఈ సినిమాను అనేక భాషల్లో నిర్మిస్తున్నారు.  అయితే, ఈ మూవీని తమిళంలో షూట్ చేస్తున్నారా లేదంటే డబ్ చేస్తున్నారా అనే విషయాలపై నిన్నటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.  అయితే, దీనికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో ఫ్యాన్స్ కొంత వరకు ఫిదా అవుతున్నారు.  ఈ సినిమాను తమిళంలో షూట్ చేయకుండా డబ్ చేస్తున్నారని, అయినప్పటికీ కూడా ఎలాంటి ఫీల్ మిస్ కాకుండా డబ్బింగ్ చేస్తారని తెలుస్తోంది.  దాదాపుగా ఇండియాలోని 10 భాషల్లో ఈ సినిమా డబ్ చేసుకోబోతున్నది.  వచ్చే ఏడాది జనవరి 8 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.