ఆరోగ్యశాఖామంత్రికి వ్యాక్సినేషన్... ప్రజల్లో అపోహలు తొలగించేందుకు... 

ఆరోగ్యశాఖామంత్రికి వ్యాక్సినేషన్... ప్రజల్లో అపోహలు తొలగించేందుకు... 

కరోనా వైరస్ కు దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.  సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.  వ్యాక్సిన్లపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి.  వ్యాక్సిన్ వేయించుకొని వికటిస్తే పరిస్థితి ఏంటని ప్రజలు భయపడుతున్నారు.  ఈ అనుమానాలతోనే వ్యాక్సిన్ వేయించుకోవడానికి సిద్ధంగా లేమని ప్రజలు చెప్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ వలన ఇలాంటి ఇబ్బందులు ఉండవని, వ్యాక్సిన్ సురక్షితమైనదని చెప్పేందుకు తమిళనాడు ఆరోగ్యశాఖామంత్రి ముందుకు వచ్చారు.  స్వయంగా డాక్టర్ కావడంతో అయన ఈరోజు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తీసుకున్నారు.  ఈరోజు ఉదయం చెన్నైలో అయనకు వ్యాక్సిన్ అందించారు.  తాను స్వయంగా వైద్యుడిని అని అందరి అపోహలు తొలగించేందుకు, మన వ్యాక్సిన్ సేఫ్ అని చెప్పేందుకు వ్యాక్సిన్ తీసుకున్నానని, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆరోగ్యశాఖామంత్రి డాక్టర్ సి విజయభాస్కర్ పేర్కొన్నారు.