ఈ నెల 30న తమిళ 'రంగస్థలం'

ఈ నెల 30న తమిళ 'రంగస్థలం'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా 'రంగస్థలం'. సుకుమార్ దర్శకత్వంలో సమంత నాయికగా రూపుదిద్దుకున్న ఈ సినిమా తమిళ డబ్బింగ్ వర్షన్ ఈ నెల 30న తమిళనాడులో విడుదల కాబోతోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇక్కడ పెద్ద సినిమాల విడుదల వాయిదా పడి, చిన్న చిత్రాలు విడుదల అవుతున్నాయి. అలానే తమిళనాడులోనూ స్ట్రయిట్ సినిమాల విడుదల వాయిదా పడుతోంది. పైగా అక్కడ థియేటర్లలో యాభై శాతం ఆక్యుపెన్సీ నిబంధన కూడా పెట్టేశారు. ఈ నేపథ్యంలో చిన్న, డబ్బింగ్ సినిమాలపైనే బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ దృష్టి పెట్టారు. ఆ రకంగా 'రంగస్థలం' విడుదలకు ఇదే సరైన సమయం అని ఆ సినిమా పంపిణీ దారుడు 7జీ ఫిలిమ్స్ శివ భావించనట్టుగా ఉంది. నిజానికి 'రంగస్థలం' కథ, కథనం తమిళులకూ బాగా నచ్చుతుందని అప్పట్లోనే అందరూ అనుకున్నారు. పైగా ఆది పినిశెట్టికి, సమంతకు కూడా అక్కడ మంచి క్రేజ్ ఉంది. మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అక్కడ ఈ సినిమా చక్కని  విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.