తమిళ స్టార్ దర్శకుడు కన్నుమూత

తమిళ స్టార్ దర్శకుడు కన్నుమూత

తమిళ స్టార్ దర్శకుడు జె మహేంద్రన్ ఈరోజు ఉదయం హఠాత్తుగా మరణించారు.  తమిళంలో అనేక సినిమాలకు దర్శకత్వం వహించిన మహేంద్రన్ 1966 లో వచ్చిన నామ్ మూవర్ సినిమాకు కథను అందించారు.  ఆ తరువాత తమిళ సినిమా ఇండస్ట్రీలో కథ రచయితగా, డైలాగ్, స్క్రీన్ ప్లే రచయితగా పనిచేశారు.  1978 లో వచ్చిన రజినీకాంత్ ముళ్ళుమ్ మలరం సినిమాతో దర్శకుడిగా మారారు.  కెరీర్లో ఎక్కువగా రజినీకాంత్ సినిమాలకు పనిచేశారు మహేంద్రన్.  

2004 లో వచ్చిన కామరాజ్ సినిమాతో ఆయన ఇండస్ట్రీకి నటుడిగా పరిచయం అయ్యారు.  విజయ్ తేరి, విజయ్ సేతుపతి సీతకత్తి, రజినీకాంత్ పెట్ట సినిమాల్లో నటుడిగా కూడా కనిపించారు.  

మహేంద్రన్ మరణం పట్ల తమిళ సినీ ఇండస్ట్రీ తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది.  మహేంద్రన్ తమిళ సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు.