తమిళ స్టార్ హీరోకు గాయాలు

తమిళ స్టార్ హీరోకు గాయాలు

అభిమాన హీరోలు తెరపై అద్భుతమైన స్టెప్స్ వేస్తె.. థియేటర్స్ లో విజిల్స్ పడతాయి.  అందరికంటే తమ హీరో స్టెప్స్ బాగా వేయాలని ప్రతి అభిమాని కోరుకుంటారు.  ఇది సహజమే.  అభిమానులను మెప్పించే స్టెప్స్ వేసే సమయంలో చిన్న చిన్న గాయాలు అవుతుంటాయి.  ఇలాంటి సిట్యుయేషన్ తమిళ స్టార్ హీరోకు ఎదురైంది.  

తెలుగులో ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాను కోలీవుడ్ లో విశాల్ అయోగ్యగా రీమేక్ చేస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ ను షూట్ చేసే సమయంలో విశాల్ కు గాయాలు అయ్యాయి.  కొంచం కష్టమైన స్టెప్ ను ప్రాక్టీస్ చేసే సమయంలో ఇలా జరిగినట్టు కోలీవుడ్ ఫిలిం నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది.  మోచేయికి, కాలికి గాయం అయినట్టు సమాచారం.