నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధారవి

నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధారవి

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా నయనతార పేరు తెచ్చుకుంది.  టాలీవుడ్ లో చేసిన శ్రీరామ రాజ్యం సినిమా తరువాత పెళ్లి చేసుకొని సెటిల్ అవుదామని అనుకుంది.  అనుకోని కారణాల వలన తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నయనతార, ఇప్పుడు వరస విజయాలతో దూసుకుపోతున్నది.  

లేడీ ఓరియంటల్ సినిమాలు చేస్తూ బిజీగా మారింది.  ప్రస్తుతం నయనతార కొలైముదిర్ కాలం సినిమా చేస్తున్నది.  ఈ సినిమా ట్రైలర్ లాంచింగ్ కు ముఖ్య అతిధిగా రాధారవి హాజరయ్యారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నయనతార గొప్పనటే కానీ ఆమెను ఎంజీఆర్, శివాజీ గణేశన్ లతో పోల్చడం సరికాదని చెప్పారు.  నయనతార సీతగా చేసి మెప్పించింది.  అటు దెయ్యంగా చేస్తూ మెప్పిస్తోంది.  నయనతారను చూస్తే దెయ్యాలు కూడా పారిపోయని అన్నాడు.  

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో దుమారం రేపాయి.  మహిళపై రాధారవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై తమిళ సినీ నటులు మండిపడుతున్నారు.  వెంటనే ఆయనను విధుల నుంచి తొలగించాలని, నయనతారకు క్షమాపణలు చెప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.