అరెస్ట్ చేస్తారన్న భయంతోనే వీడియో డిలీట్ చేశా : సింగర్

అరెస్ట్ చేస్తారన్న భయంతోనే వీడియో డిలీట్ చేశా : సింగర్

తమిళనాడులో తండ్రి తనయుడు లాకప్ డెత్ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో పెను దుమారంరేపుతున్న జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతంతో పోల్చుతున్న ఈ ఘటనపై...తమిళనాట రాజకీయ దుమారం తార స్థాయికి చేరింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ గళంవిప్పారు.  ఇక ఇటీవల సింగర్ సుచిత్ర లాక్‌డౌన్ సమయంలో మొబైల్ షాపును నడపుతున్నారన్న కారణంతో తండ్రి, తనయుడిని పోలీసులు చిత్రహింసలకు గురిచేసి చంపారని తన వీడియోలో ఆరోపించారు. ఈ వీడియోకు 2 కోట్ల వ్యూ్స్ వచ్చాయి.
ఈ వీడియోలో సుచిత్ర అవాస్తవాలు చెప్పిందని, ఇందులోని అంశాలను నమ్మవద్దని కోరుతూ తమిళనాడు సీబీ సీఐడీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. సుచిత్ర చెప్పినవి వాస్తవంకాదని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని వారు వెల్లడించారు వెంటనే ఆ వీడియోలను తొలగించాలని వారు హెచ్చరించారు.  వీడియోలను  తొలగించిన సుచిత్ర సోషల్ మీడియాలో ఎందుకు వీడియోలు డిలీట్ చేసిందో వివరించింది . అవాస్తవాలు వ్యాపింపజేసినందుకు అరెస్టు చేస్తామని హెచ్చరించినట్లు తెలిపారు. వారు తనను అరెస్టు చేయగల సమర్థులేనన్న ఉద్దేశంతో...తన న్యాయవాది సలహా మేరకు వీడియోను తొలగించినట్లు వెల్లడించింది. ఇక ఈ కేసు దర్యాప్తుపై ప్రజలు ఓ కన్నేసి ఉంచాలని కోరిన ఆమె...దర్యాప్తును తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించింది.