స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం..

స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు... స్పీకర్ పదవికి ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్‌గా తమ్మినేని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 30 మంది సభ్యులు మద్దతు తెలిపారు. మరోవైపు నామినేషన్ల గడువు ముగిసిపోయింది.. స్పీకర్ పదవికి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఇక, రేపు ఉదగయం 11 గంటలకు స్పీకర్ బాధ్యతలు చేపట్టనున్నారు తమ్మినేని సీతారాం. స్పీకర్ ఎన్నికపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని వెల్లడించారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తమ్మినేనిని స్పీకరు ఉండాలని సీఎం జగన్ నిర్ణయించారు.. శాసన సభ విలువలు కాపాడేలా తమ్మినేని వ్యవహరిస్తారని తెలిపారు.