స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని 

స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని 

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్‌ శంబంగి చిన్న వెంకటఅప్పలనాయుడు ఇవాళ ఉదయం సభాపతి తమ్మినేని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం తమ్మినేనికి సీఎం జగన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. తమ్మినేనిని స్పీకర్ ఛైర్ వద్దకు తీసుకురావాల్సిందిగా సభా నాయకుడు, ఇతర పార్టీల నేతలను ప్రొటెం స్పీకర్ శంబంగి కోరారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు, జనసేన నంచి రాపాక.. తమ్మినేనిని సభాపతి స్థానం దగ్గరకు సాదరంగా తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు.