జనసేనతో ప్రాథమిక చర్చలు...

జనసేనతో ప్రాథమిక చర్చలు...

ముందస్తుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ముందస్తు ప్రచారంతో ఎవరి వ్యూహాల్లో వారు ఉండగా... మరోవైపు కొత్త కూటమిల ఏర్పాట్లకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి... ఇటు అధికార పార్టీకి వ్యతిరేకంగా... ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లేకుండా ఓ కూటమి ఏర్పాటు చేయమే తన లక్ష్యం అంటున్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం... జనసేన పార్టీతో ప్రాథమిక చర్చలు జరిగాయన్న ఆయన... తెలంగాణలో పార్టీలపట్ల వారి వైఖరిలో స్పష్టతలేదన్నారు. కమ్యూనిస్టులంతా కలిసి ఉండాలనే దానిలో సీపీఎం, సీపీఐకి క్లారిటీ ఉందన్న తమ్మినేని... ఎవరిని వ్యతిరేకించాలి అనేదానిపైనే కమ్యూనిస్టుల మధ్య తేడాలున్నాయన్నారు. 

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో కూడా త్వరలోనే చర్చలు ఉంటాయని... టీడీపీ, కోదండరాం, సీపీఐతో కలిసి కూటమిగా పనిచేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు తమ్మినేని వీరభద్రం. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనేది సీపీఎం రాజీయ తీర్మానానికి వ్యతిరేకం... కానీ, సీపీఐ మా విధానాలనే మార్చుకోండి అని చెప్పిందని... కాంగ్రెస్ పార్టీని, టీడీపీని ఒకే ఘాటిన చూడలేమన్నారాయన. ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌, సీపీఎం కలిసి పనిచేస్తామని స్పష్టం చేసిన తమ్మినేని... సీపీఐ వైఖరి చూస్తుంటే కలిసి వచ్చే అవకాశం లేదనే అనిపిస్తోందన్నారు. కాగా, సీపీఎం ప్రతిపాదనలు వ్యతిరేకిస్తున్న సీపీఐ... కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే.