నాల్గు స్థానాల్లో పోటీ చేస్తాం..

నాల్గు స్థానాల్లో పోటీ చేస్తాం..

సార్వత్రిక ఎన్నికలకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర శాఖ సిద్ధమవుతోంది... రానున్న ఎన్నికల్లో నాల్గు స్థానాల్లో పోటీచేస్తామని ప్రకటించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. మహబూబాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో వామపక్షాలు పోటీచేస్తాయని తెలిపారు. ఐదేళ్ల పాలనలో బీజేపీ వ్యవసాయ పారిశ్రామిక రంగాలు చిన్నాభిన్నం అయ్యాయన్న ఆయన.. దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 4 పార్లమెంట్ స్థానాల్లో పోటీచేస్తామని.. పోటీచేసే 4 స్థానాల్లో సీపీఐ, సీపీఎం చెరో రెండు స్థానాల్లో పోటీ చేస్తాయని క్లారిటీ ఇచ్చారు తమ్మినేని వీరభద్రం.