నేటి నుంచి 'తానా' మహాసభలు.. ఇవీ ప్రత్యేకతలు

నేటి నుంచి 'తానా' మహాసభలు.. ఇవీ ప్రత్యేకతలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ మహాసభలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్‌ ఈ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో వేడుకలు జరుగుతాయి. 

తొలిరోజు..

  • సభల ప్రారంభసూచకంగా 100 మంది చిన్నారులతో భారీ నృత్యరూపకం ప్రదర్శన. తానా పురస్కారాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు.
  • సంగీత దర్శకుడు తమన్‌ మ్యుజికల్‌ నైట్‌, సినీనటుడు శివారెడ్డి వినోద కార్యక్రమం.
  • రాత్రికి తానా ఎక్స్‌లెన్స్‌ పురస్కారాల ప్రదానం

రెండో రోజు..

  • 'తానా పరేడ్‌' నిర్వహణ. 'ఎ మ్యుజికల్‌ జర్నీ విత్‌ ఎం.ఎం.కీరవాణి', 'గాయని సునీతతో లైవ్‌' తదితర కార్యక్రమాలు ఉంటాయి. 
  • జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ పలు కార్యక్రమాల్లో కీలకోపన్యాసాలు చేయనున్నారు. 
  • 'ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ లీడర్‌షిప్‌' అనే అంశంపై భారత్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ ప్రసంగం.
  • స్వామి పరిపూర్ణానంద, యేర్పేడు స్వామీజీ తదితరుల ఆధ్యాత్మిక ప్రసంగాలతో పాటు మేడసాని మోహన్‌ అష్టావధానం.

మూడో రోజున 'శ్రీనివాస కల్యాణం' నిర్వహించబోతున్నారు.  

ఎన్టీవీ చైర్మన్‌ చౌదరికి తానా జీవనసాఫల్య పురస్కారం

ఎన్టీవీ చైర్మన్‌ నరేంద్రచౌదరికి తానా జీవనసాఫల్యపురస్కారం లభించింది. 'తానా' 22వ మహాసభల్లో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్టు తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలియజేశారు. ఎన్టీఆర్‌ కల్చరల్‌ అవార్డ్‌ను ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణకు, తానా గుత్తికొండ రవీంధ్రనాథ్‌ సర్వీస్‌ అవార్డ్‌ను డా. గంగా చౌదరికు, తానా గిడుగు రామ్మూర్తి అవార్డును డా. గారపాటి ఉమమహేశ్వర్‌రావుకు ఇవ్వనున్నామని తెలిపారు.