తానా విశిష్ట పురస్కారం అందుకున్న ఎన్టీవీ ఛైర్మన్‌

తానా విశిష్ట పురస్కారం అందుకున్న ఎన్టీవీ ఛైర్మన్‌

22వ తానా మహాసభలను పండుగలా నిర్వహిస్తూ తెలుగువారి ఘనతను చాటుతున్నారని ప్రశంసించారు ఎన్టీవీ ఛైర్మన్ తుమ్మల నరేంద్రచౌదరి.. వాషింగ్టన్‌ డీసీలో అంగరంగ వైభవంగా జరుగిన తానా మహాసభల్లో తానా జీవనసాఫల్యపురస్కారాన్ని ఈసారి ఎన్టీవీ ఛైర్మన్ తుమ్మల నరేంద్రచౌదరి అందుకున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభల్లో తెలుగు రాష్ట్రాల్లో సేవలందిస్తున్న ప్రముఖులను తానా సత్కరించింది. తానా ఎక్స్‌లెన్సీ అవార్డ్స్‌ను ఈ సారి 12 మందికి ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్టీవీ చైర్మన్‌ తుమ్మల నరేంద్ర చౌదరిపై స్పెషల్‌గా తయారు చేసిన ఏవీలో ఆయన పడ్డ శ్రమ, చేపట్టిన కార్యక్రమాలు, ఆయన నెలకొల్పిన సంస్థలు,  అందించిన సేవలను కొనియాడింది తానా.