ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో తాప్సీ

ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో తాప్సీ

ఐపీఎల్‌ పుణ్యమాన ఇతర క్రీడల్లో కూడా లీగ్‌లు ప్రారంభమయ్యయి. ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌.. ఆఖరికి కబడ్డీలోనూ ప్రీమియర్‌ లీగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ లీగ్స్‌లో చాలా జట్లకు సినీ ప్రముఖులే యజమానులుగా ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌ నటి తాప్సీ కూడా ఆ జాబితాలో చేరింది. ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) సీజన్‌-4లో కొత్త ఫ్రాంచైజీ పూణె సెవన్‌ ఏసెస్‌ జట్టుకు తాప్సీ యజమానిగా వ్యవహరించనున్నది. కొత్త జట్టు ఎంట్రీతో లీగ్‌లో ఆడే జట్ల సంఖ్య తొమ్మిదికి చేరుకొంది. డిసెంబరు 22 నుంచి వచ్చే జనవరి 13 వరకు . పీబీఎల్‌-4 జరగనుంది.